రాష్ట్రంలో 15వ స్థానం బాలికలు 88.74, బాలురు 83.39 శాతం ఉత్తీర్ణత డీఈఓ డి.శ్రీనివాస్
బాపట్ల టౌన్: పది పరీక్షల్లో బాపట్ల జిల్లాకు ఉత్తమ ఫలితాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 86.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలికలు 88.74, బాలురు 83.39 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. 597 మార్కులు అద్దంకి బెల్ అండ్ బ్లేనేట్ హైస్కూల్ విద్యార్థి సాధించగా, కొల్లూరులోని జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి 596 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ పాఠశాలలు 80.52 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 72.61 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 92.20, కేజీబీలు 87.8 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రీ వెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని, రీ కౌంటింగ్ కోసం మే 1 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు కోసం మే 1 నుంచి 9 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.50 ఫెనాల్టీతో మే 10 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడు సబ్జెక్టులకు రూ.110.6 సబ్జెక్టులకు రూ.120 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా 15వ స్థానంలో నిలిచిందని వివరించారు. గతేడాది కన్నా మూడు శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు వెల్లడించారు.


