వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో తెలంగాణ బాలుడు | - | Sakshi
Sakshi News home page

వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌లో తెలంగాణ బాలుడు

Apr 8 2026 7:14 AM | Updated on Apr 8 2026 7:14 AM

వేటపాలెం: తెలంగాణ మంచిర్యాల ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తప్పిపోయి వేటపాలెం పోలీస్‌స్టేషన్‌ సంరక్షణలో ఉన్నట్లు ఎస్సై సురేష్‌ మంగళవారం తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన వేటపాలేనికి చెందిన బాలగోపి విజయవాడ నుంచి వేటపాలెం రైలులో వస్తున్న సమయంలో బాలగోపిని.. ఓ బాలుడు కలిసి ఆకలి వేస్తుందని డబ్బులు ఇవ్వాలని కోరాడు. బాలుడు తప్పిపోయి వచ్చినట్లు గుర్తించిన బాలగోపి ఆ పిల్లవాడిని వేటపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి వివరాలు అడిగాడు. బాలుడు ఎటువంటి వివరాలు చెప్పలేదు. దీంతో బాలుడిని తీసుకొచ్చి వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. ఎస్సై బాలుడిని వివరాలు అడగ్గా తన పేరు సంతోష్‌ అని తెలంగాణలోని మంచిర్యాల రైల్వేస్టేషన్‌ దగ్గర వాళ్ల నాన్న రోడ్డు పని చేస్తుంటాడని వివరాలు తెలిపాడు.

లారీ ఢీ కొని వ్యక్తి మృతి

వేటపాలెం: బైక్‌పై రోడ్డు క్రాస్‌ చేస్తున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టడంతో బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారి 216లో రామన్నపేట జంక్షన్‌ వద్ద సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు రామచంద్రాపురానికి చెందిన మత్స్యకారుడు బసంగారి రాజు (36) బైక్‌పై వేటపాలెం వచ్చి సొంత పనులు చూసుకొని తిరిగి రామచంద్రాపురం వెళుతున్నాడు. బైపాస్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద రోడ్డు దాటే సమయంలో వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌ పై నుంచి కింద పడిన రాజు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీస్‌లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్‌ కాల్వలో విద్యార్థి గల్లంతు

కారెంపూడి: సాగర్‌ కాల్వలో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన ఘటనలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామంలోని వడియరాజుల కాలనీకి చెందిన కొమెర రాజారావు తోటి స్నేహితులతో కలసి దగ్గర్లో ఉన్న సాగర్‌ కుడి కాల్వకు ఈతకు వెళ్లారు. అందరూ ఈత కొడుతుండగా విద్యార్థి రాజారావు(13) ప్రవాహవేగానికి గల్లంతయ్యా డు. స్నేహితులు చూసిన వారు తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. కొమెర ఏసు రాజు దంపతులకు రాజారావు ఒక్కగానొక్క కుమారుడు, 7వ తరగతి పరీక్షలు రాశాడు. ఈ కాల్వలోనే చాలా మంది ఈతలు కొడుతుంటారు. పిల్లలను కాల్వలకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement