అక్రమాలే.. కొంటే ‘అవుట్‌’ | - | Sakshi
Sakshi News home page

అక్రమాలే.. కొంటే ‘అవుట్‌’

Mar 24 2026 7:55 AM | Updated on Mar 24 2026 7:55 AM

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026 అక్రమాలే.. కొంటే ‘అవుట్‌’

నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు జిల్లా స్థాయిలో చీరాల నియోజకవర్గంలోనే అత్యధికంగా అనధికారిక లే అవుట్లు అందులో వేటపాలెం మండలంలో సింహభాగం సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు కీలక నేతల అండ...అందుకు కప్పం చెల్లింపు..అధికారుల స్వలాభాపేక్ష కొన్ని లేఅవుట్లలో కొనుగోలుదారులకు చేదు అనుభవాలు పచ్చ గూటికి చేరాం ... ఇబ్బంది లేదనే భావనలో కొందరు వెంచర్ల యజమానులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఆర్డీఓ, తహసీల్దార్‌ లాగిన్ల నుంచి కన్వర్షన్‌ ఆప్షన్‌ తొలగింపు

ఒక్కొక్కరిది ఒక్కో రంగు

లేఅవుట్లు వేసే వారిలో పలువురు వారి బ్రాండుకు అనుగుణంగా హద్దు రాళ్ల మీద రంగులు వేస్తుంటారు. ఆ రంగును బట్టి ఆ లేఅవుట్‌ ఎవరిదో అధికారులకు అర్థమవుతుంది. ఈ క్రమంలో అస్మదీయులు, తస్మదీయులుగా కేటగిరీలు నిర్ణయిస్తారని, అందుకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా జరిగిన పరిణామాలను ప్రజలు చర్చించుకుంటున్నారు.

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
పైసా పైసా కూడ బెట్టి పొదుపు చేసి..ఓ ప్లాటు కొందామనేది మధ్య తరగతి ప్రజల కల. కొంతమంది అయితే అప్పులు చేస్తారు. మరి కొందరు బంగారం తాకట్టు పెడతారు. ఇంకొందరు బ్యాంకుల్లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటారు. ఇంతా చేసి ఓ వెంచర్‌లో ప్లాటు కొన్నాక అది అక్రమం అని తేలితే.. ఆ వ్యక్తి, ఆ కుటుంబం పడే క్షోభ వర్ణనాతీతం.

చీరాల అర్బన్‌: చంద్రబాబు జమానాలో ధృతరాష్ట్ర పాలన సాగుతోంది. చీరాల నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికారిక లేఅవుట్లు అందుకు ఒక నిదర్శనం. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తుగా కన్వర్షన్‌ రుసుం చెల్లించాలి. అయితే సుమారు ఐదు నెలలుగా ఆర్డీఓ, తహసీల్దార్‌ లాగిన్ల నుంచి కన్వర్షన్‌ ఆప్షన్‌ తొలగించారు దీంతో స్థిరాస్థి వ్యాపారులు ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో కింద నుంచి పైవరకు ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తరువాత నిర్మాణ సమయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో అత్యధికంగా అనధికారిక లేఅవుట్లు

అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అనధికారిక లేఅవుట్లు, అత్యధికంగా చీరాల నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో బుడా (బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో సింగిల్‌ నెంబర్‌లో, ఓడా (ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో రెండంకెల సంఖ్యలో అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని అధికారికంగానే ప్రకటించారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయం పక్కన పెడితే, కొత్తగా కూడా అనధికారిక (పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండా) లేఅవుట్లు వెలుస్తుండటం దేనికి సంకేతమో సంబంధిత అధికారులే చెప్పాలి. సంబంధీకులు కీలక నేతలకు కప్పం కడుతూ, రాజకీయ అండ ఉందని చెప్పుకుంటూ, అధికారులను కూడా సంతృప్తి పరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పచ్చ గూటికి చేరాం .. ఇబ్బంది ఉండదులే...

ఎన్నికల అనంతరం అనధికారిక లేఅవుట్లు వేసే వారిలో కొందరు ప్రత్యక్షంగా పచ్చ గూటికి చేరారు. మరికొందరు పరోక్షంగా పచ్చ నేతలతో రాయ‘బేరాలు’ నడుపుకుంటూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే వాదనలు బలంగా వివిపిస్తున్నాయి. ఓ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య పాలెం సమీపంలో తీరం వెంట ప్రస్తుతం చేపట్టిన ఓ లేఅవుట్‌ ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించి ఆ మాజీ చైర్మన్‌ పైకి కనిపిస్తున్నా, అంతర్లీనంగా మరికొందరు ఉన్నారని చెప్పుకుంటున్నారు.

అడుగు వేద్దాం...

పొట్టిసుబ్బయ్యపాలెం తీరం సమీపంలో వేస్తున్న అడుగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే అప్పుడు అసలు కథ మొదలు పెడదామనే భావనలో సంబంధీకులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అభ్యంతరాలు లేకుండా పని సాగితే అసలు ప్రాజెక్టు అప్పుడు ప్రారంభమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెరవెనుక బడా బాబులు ఉన్నారని చెప్పుకుంటున్నారు.

క్విడ్‌ ప్రోకోకు అడుగులు

తీరప్రాంత అభివృద్ధి నేపథ్యంలో నిధులు మంజూరవుతాయని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో సదరు లేఅవుట్‌ వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో క్విడ్‌ ప్రోకోకు అడుగులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. లేఅవుట్‌కు ఇబ్బంది లేకుండా విక్రయాలు జరిగేలా, రోడ్డు కూడా వేస్తే భారీ మొత్తంలో నగదు కీలక నేతలకు, సంబంధిత అధికారులకు ముట్టచెప్పే ఒప్పందాలపై చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సీఆర్‌జెడ్‌ నిబంధనలా... అవేంటి?

తీరంలో సీఆర్‌జెడ్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టేవారు కానీ, లేఅవుట్లు వేసే వారు కానీ పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించటం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఆర్‌జెడ్‌ పరిధిలో నిర్మించిన, నిర్మిస్తున్న రిసార్టులు, వేసిన లేఅవుట్లు అందుకు నిలువెత్తు నిదర్శనాలంటున్నారు. అసలు నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎందుకు అడ్డుకోవటం లేదనేది ప్రశ్న. సంబంధిత అధికారులకు ఆ నిర్మాణాలు కనిపించవా అని ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement