ప్రజా గళమే.. సంతక పథం
ప్రజా గళమే.. సంతక పథం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెలకొల్పిన మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటుకు అప్పచెప్పి చేతులు దులుపుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు చేసింది తప్పని కూటమి వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందని వారు అంగీకరిస్తున్నారు.
మెడికల్ కళాశాలలు ప్రభుత్వం నిర్వహిస్తే పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి రావడంతోపాటు ఆస్పత్రి నిర్మాణంతో జిల్లాలో మెరుగైన వైద్య సేవలు లభించేవని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. కేవలం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పేరు వస్తుందన్న అక్కసుతో ప్రభుత్వం దుర్మార్గంగా మెడికల్ కళాశాలలను ప్రయివేటుకు కట్టబెట్టారని వారు విమర్శిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ అధినేత ఆదేశాలతో కోటి సంతకాల ఉద్యమం చేపట్టామన్నారు.
జిల్లాలోని బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కోటి సంతకాల ఉద్యమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ లక్ష్యాలకు మించి జరిగింది. పార్టీ శ్రేణులతోపాటు అన్ని వర్గాలవారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 60 వేల సంతకాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 64,800 సంతకాలు పూర్తిచేశారు. వేమూరు నియోజకవర్గంలో 60 వేలకుగాను 62 వేల సంతకాలు అయ్యాయి. రేపల్లెలో 60 వేలకుగాను 52 వేలు, పర్చూరులో 70 వేలకుగాను 55 వేలు, చీరాలలో 60 వేలకుగాను 53 వేలు, అద్దంకిలో 60 వేలకుగాను 48 వేల సంతకాలు పూర్తయ్యాయి. ఇంకా సంతకాల సేకరణ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ప్రజల మద్దతు భారీగా లభిస్తోంది.
● వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై
నిరసన వెల్లువ
● పేదవిద్యార్థుల భవిష్యత్తును
దెబ్బతీశారని విమర్శలు
● చంద్రబాబు సర్కారుపై
తీవ్ర ప్రజాగ్రహం
● వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ
ఉద్యమానికి భారీగా మద్దతు
● జిల్లాలో ఉద్యమంలా కొనసాగుతున్న
సంతకాల సేకరణ
● బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లో
ఇప్పటికే లక్ష్యం చేరిక
ముమ్మరంగా కార్యక్రమం
వైద్య కళాశాలల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులేకాకుండా చదువుకున్నవారు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతతోపాటు అన్ని వర్గాలవారు సంతకాలు పెట్టి ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. అందరూ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను తప్పుబడుతున్నారు.
1/1
ప్రజా గళమే.. సంతక పథం