సందడిగా మారిన సముద్ర తీరం
చీరాల టౌన్: వాడరేవు సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో చీరాల, పర్చూరు, గుంటూరు, చిలకలూరిపేట ప్రాంతాలకు చెందిన పర్యాటకులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వాడరేవుకు చేరుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడిపారు. సముద్రపు అలలతో కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ సముద్రపు మన్నుతో ఆటలాడుకుంటూ సరదాగా గడిపారు. పర్యాటక ప్రాంతాలైన వాడరేవు, రామాపురం, తదితర సముద్ర తీర ప్రాంతాలు పోలీసుల భద్రత పహారాలో ఉన్నాయి. తీరం మొత్తం పోలీసుల నిఘాలో ఉండటంతో పాటుగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లతో పహారా, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


