ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు. ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం ! నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం దివ్యాంగుల హక్కుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 పొట్టకూటి కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం
పొట్టకూటి కోసం ప్రతి ఏటా ఇలా వస్తున్నాం. చలైనా, ఎండైనా రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని ఉంటాం. ప్రధాన రహదారి పక్కనే జీవిస్తుంటాం. వ్యాపారం సాగినంత వరకు ఇక్కడే ఉంటాం. లేని పక్షంలో ఇతర ప్రాంతాలకు వెళ్తాం.
కుటుంబంతో వలస
కుటుంబంలో అందరం కలసి జీవనోపాధి కోసం వలస వస్తుంటాం. మగవారికి వంట చేసి పెడుతూ, వారు చేసే పనుల్లో తామూ భాగం పంచుకుంటూ జీవనం సాగిస్తుంటాం. మా మగవారు ఎక్కిడికి వెళితే మేము వారితో పాటు వెళ్తుంటాం.
వేటపాలెం: ఆకలికి రుచి తెలియదు.. నిద్ర సుఖమెరగదు అనే సామెత మనందరికీ తెలుసు. ఇది శ్రామిక జీవులకు అక్షరాలా సరిపోతుంది. కనీసం నిలువ నీడలేని ఆ కుటుంబాలు ఉపాధిని వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటి బాపట్ల జిల్లా చీరాల నియోజవర్గానికి వలస వచ్చాయి. రోడ్డు పక్కన గుడారాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజసేన్ జిల్లా, బరేలీ గ్రామానికి చెందిన దాదాపు 10 కుటుంబాల చెందిన వారు ఇటీవల చీరాలకు వచ్చారు. వ్యవసాయ, వంట సామగ్రి పరికరాలు తయారు చేసి అమ్ముతున్నారు. ఈపురుపాలెం రోడ్డు పక్కన మూడు కుటుంబాలు, చీరాల–వేటపాలెం ప్రధాన రహదారి పక్కన జాండ్రపేట వద్ద రోడ్డు పక్కన మరికొందరు గుడారాలు వేసుకుని ఉంటున్నారు.
మధ్యప్రదేశ్ వాసులు తమతో తీసుకువచ్చిన ఇనుప రాడ్లను రైతుల ముందే కొలిమిలో కాల్చి వారు కోరిన విధంగా పనిముట్లు తయారు చేస్తారు. ఒక్కోదానిని బరువు ఆధారంగా రూ. 100 నుంచి 700 వరకూ విక్రయిస్తారు. షాపుల్లో ఇటువంటి వస్తువులు లభించినా, తమ కళ్ల ఎదురుగానే తయారు చేసే పనిముట్లను కొనుగోలుకు ప్రజలు, రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీరందరూ ఏడాదిలో పది నెలల పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో తయారు చేసిన పరికరాలు విక్రయిస్తూ సంచార జీవితం గడుపుతారు. ప్రస్తుతం నవంబర్ నుంచి రాష్ట్రంలో తిరుగుతున్నారు. తాము తయారు చేసే పరికరాలు మన్నికతో ఉంటాయని, అందుకే కొనేందుకు ఆసక్తి చూపుతారని అర్జున్ అనే కార్మికుడు తెలిపాడు.
వ్యవసాయ పరికరాల తయారీలో పురుషులతో సమానంగా మహిళలు, పెద్దవారితో సమానంగా బాలలు చెమటోడ్చి కష్టపడతారు. ఇనుమును కాల్చి వస్తువుగా తయారు చేసే సమయంలో మగవారితో సమానంగా సమ్మెట దెబ్బలు వేస్తున్నారు. కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తూ పురుషులకు తామేమి తీసిపోమని నిరూపిస్తున్నారు. 10న కోటి సంతకాల పత్రాల తరలింపు అద్దంకి రూరల్: చంద్రబాబు సర్కార్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వెఎస్సార్ సీపీ సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల 10వ తేదీన నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ కోరారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఐదు కాలేజీలు పూర్తి చేశారని తెలిపారు. వాటిల్లో ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు భర్తీ ఆయ్యాయని వివరించారు. కోటి సంతకాలపై వైద్యశాఖమంత్రి ఆరోపణలు చేయటం కాదని నిజం తెలుసుకోవాలన్నారు. ఆయనకు పూర్తి సమాచారం కాలంటే తన నియోజకవర్గానికి వస్తే చూపిస్తానని, లేదా వారి నియోజకవర్గంలోనైనా చూపిస్తామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
న్యూస్‌రీల్
పొట్ట కూటి కోసం వలస జీవుల పాట్లు ఉపాధి కోసం రాష్ట్రాలు దాటి రాక మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కుటుంబాలు రోడ్డు పక్కన గుడారాలే ఆవాసాలు
సొంతంగా పరికరాల తయారీ
వ్యవసాయ పనుల్లో నిత్యం ఉపయోగించే కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం తదితర పనిముట్లతో పాటు ఇంట్లో ఉపయోగించే కత్తి పీటలను తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని సాగర్, భోపాల్ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి జిల్లాకు తరలివచ్చారు. గ్రామాల్లో ప్రధాన రహదారి పక్కనే తాత్కాలికంగా నివాసముంటూ అక్కడే వ్యవసాయ పరికరాలు తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఆయా వస్తువులకు ఉన్న డిమాండ్‌ను బట్టి వారం లేదా నెల రోజులు ఉంటారు. అనంతరం మరో గ్రామానికి వలస వెళతారు.
బాపట్ల
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 43.5481 టీఎంసీలు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.1000, గరిష్ట ధర రూ.1600, మోడల్ ధర రూ.1300 వరకు పలికింది.
పుస్తకం ఆవిష్కరణ
–రాజసేన్, పనిముట్ల తయారీదారుడు, బరేలీ గ్రామ్, భోపాల్
–రేఖ, మధ్యప్రదేశ్, రాజ్‌సేన్ జిల్లా
కొనేందుకు ప్రజల ఆసక్తి
పురుషులతో సమానంగా మహిళలు
వైఎస్సార్‌సీపీ అద్దంకి సమన్వయకర్త
డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్
7
1/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
2/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
3/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
4/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
5/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
6/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
7/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
8/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
9/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !
10/10
ఆకలి ఆరాటం.. బతుకు పోరాటం !