ఎస్టీయూ జిల్లా సీపీఎస్ కన్వీనర్‌గా విజయప్రసాద్
సత్తెనపల్లి: ఎస్టీయూ జిల్లా సీపీఎస్ విభాగం కన్వీనర్‌గా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జెల్ది విజయప్రసాద్ ఎన్నికయ్యారు. నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఎస్టీయూ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సోమవారం విజయప్రసాద్ మాట్లాడుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఓపీఎస్ సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలు జయప్రదం చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు, ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్వీ రామిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జెల్ది విజయప్రసాద్ నియామకంపై పలువురు ఉపాధ్యాయులు హర్షం వెలిబుచ్చారు.


