సాఫ్ట్‌బాల్ విజేతలకు బహుమతులు అందజేత
వేమూరు(చుండూరు): రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడలో విజేతలకు బహుమతులు అందజేయడం జరిగిందని అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ రిఫరి జగదీశ్వరరెడ్డి తెలిపారు. చుండూరు మండలం మోదుకూరులోని శ్రీ వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. విజేతలకు సోమవారం బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. బాలురుల్లో విజయనగరం జిల్లాకు చెందిన జట్టు ప్రథమ బహుమతి సాధించారు. కడప జిల్లాకు చెందిన జట్టు ద్వితీయ స్థానం సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జట్టు తృతీయ స్థానం సాధించింది. బాలికల్లో గుంటూరు జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానం, విజయనగం జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించాయి.


