మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి జరిగిన అర్చనలు, విశేష పూజలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారం శ్రీరామనామక్షేత్రం ఆవరణలో 99వ శ్రీరామకోటి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ట్రస్టీస్ రాగం వెంకటలీలాసుందరి, బెల్లంకొండ మస్తాన్‌రావు ఆధ్వర్యంలో జరగ్గా, సాయంత్రం క్రోసూరి మురళీకృష్ణమాచార్యుల బృందం అంకురారోపణం, అగ్నిస్థాపనం, రుత్విగ్వరణం, అఖండ జ్యోతిస్థాపన, శ్రీరామ పతాకావిష్కరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్ (సీతానగరం) కార్యదర్శి శ్రీమాన్ స్వామి వినిశ్చలానంద పతాకావిష్కరణ చేసి, అనుగ్రహభాషణం చేశారు. 99 ఏళ్లుగా శ్రీరామకోటి మహోత్సవాలను నిర్విరామంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వంశపారంపర్యంగా ఆ సీతారాముల అనుగ్రహంతో పలు ప్రాంతాల భక్తులు, దాతల సహకారంతో చేపట్టడం ఒక బృహత్తర యజ్ఞంగా పేర్కొన్నారు. కలియుగంలో తరించేందుకు రామనామ సంకీర్తనే సరైన మార్గమని చెప్పారు. క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో అలకరించారు.
పట్నంబజారు: గుంటూరు డిపో 1 నుంచి హైకోర్టుకు వయా తుళ్లూరుకు నిత్యం ఉదయం 8.00గంటలకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరే జనరల్ బస్సు టైమ్‌ను 7.45 నిమిషాలకు మార్చినట్లు డిపో 1 అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి 15 నిముషాల ముందుగా మార్చినట్లు వివరించారు. సోమవారం నుంచి మారిన బస్సు సమయం మార్పులను ప్రయాణికులు, ఉద్యోగులు గమనించాలని కోరారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 578.00 అడుగులకు చేరింది. ఇది 277.2460 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 10,000, ఎడమ కాలువకు 8,367, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 20,167 క్యూసెక్కులు కాగా... శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 20,167 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,010 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 10.2 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవల్‌కి నీటిని నిలిపివేశారు. బ్యాంక్ కెనాల్‌కు 196, తూర్పు కాలువకు 92 క్యూసెక్కులు వదిలారు. పశ్చిమ కాలువకు, నిజాంపట్నం కాలువకు నీటిని విడుదల చేయలేదు. కొమ్మూరు కాలువకు 1,703 క్యూసెక్కులు విడుదల చేశారు.
మహాశక్తి దేవతగా బగళాముఖి
మహాశక్తి దేవతగా బగళాముఖి
మహాశక్తి దేవతగా బగళాముఖి


