మృత్యువులోనూ వీడని స్నేహం
● బైక్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని
వాహనం
● సంఘటనా స్థలంలో ఒకరు, ఆస్పత్రికి
తరలిస్తుండగా మరొకరు మృతి
దర్శి: వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మిత్రులు తీవ్ర గాయాలతో మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన దర్శి–అద్దంకి రోడ్డులో పోలవరం–వేంపాడు గ్రామాల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. వేంపాడు గ్రామానికి చెందిన చాట్ల వంశీ(18), స్నేహితుడు అద్దంకిలోని సంజీవనగర్‌కు చెందిన షేక్ సుభానీ(17)తో కలిసి మిషన్ మరమ్మతుల కోసం అద్దంకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరిని స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఎదురుగా అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దర్శి నుంచి అద్దంకి వెళ్తున్న వాహనం ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన షేక్ సుబానీని 108 అంబులెన్స్‌లో అద్దంకి వైద్యశాలకు తరలించే క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతులు ఇద్దరూ దర్శిలోని ఓ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు చాట్ల వంశీ
షేక్ సుభాని
మృత్యువులోనూ వీడని స్నేహం


