కార్తిక పౌర్ణమి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

కార్తిక పౌర్ణమి ప్రత్యేక పూజలు

Nov 6 2025 8:14 AM | Updated on Nov 6 2025 8:14 AM

కార్త

కార్తిక పౌర్ణమి ప్రత్యేక పూజలు

బాపట్ల: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్లలోని సోమేశ్వరస్వామి, అగ్రహారంలోని రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు జరిగాయి. త్యాగనగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సహస్ర దీపార్చన నిర్వహించారు. స్వామి నామాల ఆకృతిలో దీపాలు ఏర్పాటు చేశారు. గోవింద నామం, అష్తోత్తర లక్ష్మీ సహస్ర నామావళిని మహిళా బృందం జపించింది. భక్తులు పెద్దసంఖ్యలో వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అర్చకుడు వీహెచ్‌ వరప్రసాద్‌, ఆలయ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పీవీఎన్‌ ప్రసాద్‌, సభ్యులు జి.శ్రీనివాసరావు, వై. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కార్తిక పౌర్ణమి ప్రత్యేక పూజలు 1
1/1

కార్తిక పౌర్ణమి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement