
జర్నలిస్టులను వేధించే హక్కు ఎవరిచ్చారు ?
వేమూరు: అంబేడ్కర్ రాజ్యాంగంలో పత్రికలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి రాశారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా జర్నలిస్టులను వేధించడం అన్యాయం. ఏ పౌరుడికై నా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, భావాలను వ్యక్తీకరించే హక్కు ఉంది. జర్నలిస్టులకు కూడా ఇవి వర్తిస్తాయి. వారిని వేధించడం, దాడులు చేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదు. కూటమి ఆగడాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. జర్నలిస్టులపై దాడుల్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది.
– వరికూటి అశోక్‌బాబు,
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ అధికారి ప్రతినిధి,