భావన్నారాయణుడిని దర్శించుకున్న జడ్జి | - | Sakshi
Sakshi News home page

భావన్నారాయణుడిని దర్శించుకున్న జడ్జి

Oct 19 2025 6:43 AM | Updated on Oct 19 2025 6:51 AM

భావన్నారాయణుడిని దర్శించుకున్న జడ్జి సత్పప్రవర్తనతో మెలగాలి హామీల అమలులో నిర్లక్ష్యం తగదు డీజిల్‌ ట్యాంక్‌ పేలి కంటైనర్‌ దగ్ధం

బాపట్ల: పట్టణంలోనిశ్రీ భావన్నారాయణస్వామిని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్‌ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

రేపల్లె: జైలు నుంచి విడుదలైన తర్వాత సత్పప్రవర్తనతో మెలగాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.పి.డి. వెన్నెల సూచించారు.పట్టణంలోని సబ్‌జైల్‌ను శనివారం ఆమె సందర్శించి, రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులతో జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. ఇక నుంచైనా తప్పులు చేయకుండా కుటుంబ సభ్యులతో చక్కని జీవితాన్ని గడపాలని ఆమె సూచించారు. జైలులో విరామ సమయంలో పుస్తక పఠనం చేయాలని చెప్పారు. ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించి, ఉచిత న్యాయ సహాయం పొందే విధానంపై వివరించారు. ఈ సందర్భంగా జైలులో కల్పిస్తున్న సౌకర్యాలపై రిమాండ్‌ ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

చేనేత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగుడు సత్యనారాయణ

చీరాల రూరల్‌: ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురుగుడు సత్యనారాయణ డిమాండ్‌ చే శారు. ఈపురుపాలెంలో శనివారం నిర్వహించిన సంఘ ఏరియా కమిటీ సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి 14 నెలలు పూర్తయినా ఇంతవరకూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఏడాదికి 25 వేల ఆర్థిక సాయం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తృప్తి ఫండ్‌ కంట్రిబ్యూషన్‌ మొత్తం రూ. 27 కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు గద్దె హేమసుందరరావు, జిల్లా వృత్తి సంఘాల సమన్వయ కమిటీ కార్యదర్శి టి. కొండయ్య, చేనేత నాయకులు ఎర్ర రాధాకృష్ణ, అనుభం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

యద్దనపూడి: టైరు పేలి కంటైనర్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టటంతో డీజిల్‌ ట్యాంక్‌ పగిలి దగ్ధమైన సంఘటన తాతపూడి వద్ద శనివారం చోటు చేసుకుంది. హైవే మొబైల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళగిరి నుంచి చైన్నె పేపర్‌ లోడుతో వెళుతున్న కంటైనర్‌ టైరు తాతపూడి వద్దకు రాగానే ఒక్కసారిగా పేలింది. దీంతో అదుపుతప్పిన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంక్‌ నుంచి మంటలు రేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

భావన్నారాయణుడిని దర్శించుకున్న జడ్జి 1
1/1

భావన్నారాయణుడిని దర్శించుకున్న జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement