
యోగా పోటీలకు వేటపాలెం విద్యార్థినుల ఎంపిక
వేటపాలెం: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్లు వేటపాలెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని శనివారం తెలిపారు. ఇటీవల రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్– 19 యోగా ఎంపిక పోటీలు సింగరాయకొండలో నిర్వహించారని పేర్కొన్నారు. ఇందులో ఎనిమిదో తరగతి విద్యార్థినులు కె. కావ్య, షేక్ ఆసిఫా యోగా రిథమిక్ డబుల్స్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆమె వివరించారు. ఈ నెలలో నెల్లూరులో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు జె. దేవభిక్షం, జె. శ్రావణి విద్యార్థినులను అభినందించినట్లు పేర్కొన్నారు.