కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం

Oct 19 2025 6:43 AM | Updated on Oct 19 2025 6:43 AM

కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం

కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం

కేఎల్‌యూ శాటిలైట్ల ప్రయోగం విజయవంతం

తాడేపల్లి రూరల్‌: వడ్డేశ్వరంలోని కేఎల్‌ విశ్వవిద్యాలయం శనివారం శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్‌ కె.రఘురామకృష్ణరాజు, కేఎల్‌యూ వైస్‌ చైర్మన్‌ కోనేరు నిఖిల కార్తికేయన్‌, వీసీ పార్థసారథి వర్మలతో కలిసి కాన్‌శాట్‌ను నింగిలోకి వదిలారు. తొలుత బెలూన్‌ సహాయంతో మొదటి కేఎల్‌ జాక్‌ శాటిలైట్‌ను పంపారు. ఉదయం 5.45 నిమిషాలకు కేఎల్‌ జాక్‌ శాటిలైట్‌ను పీకో బెలూన్‌ సాయంతో వదిలారు. కేఎల్‌ జాక్‌ శాటిలైట్‌ గాలి నాణ్యతపై పరిశోధన చేయనున్నట్లు రూపకర్త డాక్టర్‌ సిహెచ్‌ కావ్యశ్రీ తెలిపారు. కేఎల్‌శాట్‌2ను ఫ్‌లైట్‌ మోడ్‌ డ్రోన్‌ సహాయంతో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఏటీసీ గన్నవరం ఎయిర్‌ ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ వచ్చిన తరువాత 6.45 గంటలకు బెంగళూరుకు చెందిన రెడ్‌వింగ్‌ అనే సంస్థ సహకారంతో ఫ్‌లైట్‌ మోడ్‌ డ్రోన్‌ సాయంతో నింగిలోకి పంపారు. శాటిలైట్‌ 1 గంట పాటు నిర్దేశిత కక్ష్యలో భూమి నుంచి సుమారు 12 కి.మీ. ఎత్తులో 60 కి.మీ. సమాంతరంగా ప్రయాణించి పరిశోధనలు చేసి మళ్లీ లాండ్‌ప్యాడ్‌పై విజయవంతంగా దిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న మేక్‌ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ పోటీల్లో కేఎల్‌యూ విద్యార్థులు రూపొందించిన కాన్‌శాట్‌ ఉపగ్రహం ఏపీ నుంచి ఎంపికై నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement