రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

Oct 9 2025 2:53 AM | Updated on Oct 9 2025 2:53 AM

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక

చీరాల రూరల్‌: జిల్లాస్థాయి తైక్వాండో స్కూల్‌ గేమ్స్‌ సెలక్షన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో 69వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 2025–26 ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ తైక్వాండో సెలక్షన్స్‌ నిర్వహించారు. ఈ పోటీలను స్కూల్‌గేమ్స్‌ జిల్లా సెక్రటరీ, రాష్ట్ర తైక్వాండో వైస్‌ ప్రసిడెంట్‌ షేక్‌ అబ్దుల్‌ సలాం పర్యవేక్షణలో నిర్వహించారు. పోటీల్లో చీరాల్లోని విజ్ఞాన భారతి హైస్కూల్‌, గౌతమి, సెయింట్‌ ఆన్స్‌ స్కూలు, కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన 12 మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభచూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చీరాల కోచ్‌ ఎస్‌డీ సలావుద్దీన్‌ తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు..

అండర్‌–17 బాలుర 48 కేజీల విభాగంలో వి.హేమంత్‌, 59 కేజీల విభాగంలో ఎస్‌కే కాలేషావలి, 45 కేజీల విభాగంలో ఎన్‌.వెంకటరమణ, 55 కేజీల విభాగంలో వి.మనోహర్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్‌–17 బాలికల 55 కేజీల విభాగంలో ఎస్‌కే తాహిర, 44 కేజీల విభాగంలో ఎన్‌.ప్రవళిక, 52 కేజీల విభాగంలో వై.లక్ష్మీప్రియ, 63 కేజీల విభాగంలో బి.కావ్యలు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్‌–14 బాలుర 44 కేజీల విభాగంలో ఎల్‌.కార్తీక్‌మణికంఠ, 41 కేజీల విభాగంలో వి.శరత్‌కుమార్‌, అలానే బాలికల అండర్‌–14 విభాగంలో 38 కేజీల విభాగంలో ఎస్‌కే తస్లీమా, 24 కేజీల విభాగంలో వి.జాహ్నవి ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్‌–14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 10, 11 తేదీల్లో రేపల్లెలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్‌ సలావుద్దీన్‌ తెలిపారు. అండర్‌–17 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 18న వైఎస్సార్‌ కడప జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆయా పాఠశాలలకు చెందిన హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్‌, పీఈటీలు, క్రీడాకారులకు శిక్షణనిచ్చిన కోచ్‌లు సయ్యద్‌ సలావుద్దీన్‌, పి.ప్రశాంత్‌బాబును రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement