
రేపు రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్: దివంగత స్విమ్మర్ కానాల అంజినీ శ్రీక్రాంత్‌రెడ్డి స్మారకార్ధం ఈనెల 10న 8వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహిస్తామని మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ది రమణారావు తెలిపారు. బుధవారం స్థానిక అరండల్‌పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి మాస్టర్స్ స్విమ్మర్లు పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరిహరనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఈతకొనలనులో ఏర్పాటు చేశామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.