
మతోన్మాదిని శిక్షించాలి..
బాపట్ల: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై మతోన్మాద న్యాయవాది చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. జస్టిస్ గవాయ్‌పై దాడికి నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఈ దాడి ఒక వ్యక్తిపై కాదని భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి , స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, సిహెచ్ ముజుందర్, జిల్లా కమిటీ సభ్యులు పి కొండయ్య, నాయకులు కె. శరత్ , కె. నాగేశ్వరావు, టి.సుభాషిణి, మహబూబ్ సుభాని, చిన్న పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య