
రాష్ట్రస్థాయి తైక్వాండోలో సత్తా
చినగంజాం: చినగంజాం విద్యార్థులు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటారు. ఆరుగురు హాజరై గోల్డ్ మెడల్ సాధించారు. ఒంగోలులోని ఇస్లాం పేట షాదీకానాలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర జిల్లాల తైక్వాండో ఎంపికలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి, తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, ఉమ్మడి ప్రకాశం జిల్లా కోచ్‌లు, క్రీడాకారుల సమక్షంలో జిల్లా నలుమూలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–17 విభాగంలో చినగంజాం సత్యం హైస్కూల్‌కు చెందిన కుక్కల రక్షిత్ రెడ్డి (38 కేజీల కేటగిరీ) గోల్డ్ మెడల్, వాటుపల్లి మౌనిక (42 కేజీలు) గోల్డ్‌మెడల్, అండర్ 14 విభాగంలో ఎల్. గీతిక (32కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.హరినాథ్, ఆర్. శ్రీనివాసరావు, సి.రమేష్ క్రీడాకారులను అభినందించారు. చినగంజాం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అండర్–17 విభాగంలో సీహెచ్ జాషువా (42 కేజీల కేటగిరి) గోల్డ్‌మెడల్, బి.యశ్వంత్ (68 కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం కె.శ్రీనివాసరెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు జి.అంకమ్మరావు, ఎస్.నరసింహరావు, పి.వెంకట ప్రసాద్, రాష్ట్రస్థాయి ఎంపికై న విద్యార్థులను, వీరికి శిక్షణ ఇచ్చిన కోచ్ వాటుపల్లి సుబ్రహ్మణ్యంను అభినందించారు.