రైతులకు కేళీ కష్టాలు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 రైతులకు కేళీ కష్టాలు ● కొల్లూరు: మండలంలోని అనంతవరంలో సాగు చేసిన సుమారు 500 ఎకరాల వరకు పంట కేళీల బారిన పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేళీల కారణంగా తమకు ఏర్పడుతున్న నష్టాన్ని పూడ్చాలని కోరు తూ సోమవారం కొల్లూరు రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంగళవారం మండల వ్యవసాయ శాఖాధికారి నరేంద్ర వరి పంటలను పరిశీలించి కేళీలు వచ్చినట్లు రైతుల వద్ద నిర్ధారించారు. ఎన్‌ఆర్‌ఐ కంపెనీకి చెందిన బీపీటీ 5204 రకం విత్తనాలను అనంతవరం గ్రామానికే చెందిన టీడీపీ నాయకుడు, ధాన్యం వ్యాపారి తమకు విక్రయించినట్లు రైతులు వ్యవసాయశాఖాధికారుల వద్ద వెల్లడించారు. వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులు పెట్టడం, ధాన్యం కొనుగోళ్లు అతనే చేపడుతుండటంతో అతని వద్ద వి త్తనాలు కొనుగోలుచేసి సా గు చేసినట్లు రైతులు వాపోతున్నా రు. సాగు చేసిన పంట కాల పరిమితికి మించి ముందే ఈని వరి కంకులు రావడంతో పరిశీలించగా తాలు గింజలతో కూడిన కేళీలుగా నిర్ధారణైందని ఏఓ వద్ద మొరపెట్టుకున్నారు.
పంట కాలపరిమితితో పని లేకుండా వరి కంకులు
ఖరీఫ్‌లో సాగు చేసే బీపీటీ రకం విత్తనాలు సాధారణంగా 120 నుంచి 135 రోజుల కాల వ్యవధిలో పంట దిగుబడి రైతు చేతికందుతుంది. అనంతవరంలో రైతులు సాగుచేసిన ఎన్‌ఆర్‌ఐ 5204 రకం విత్తనాలు మాత్రం పంట కాలపరిమితితో పొంతన లేకుండా ముందుగానే తాలు గింజలతో కూడిన కేళీ కంకులు రావడం రైతులకు మింగుడు పడని వ్యవహారంగా మారింది.
అనంతవరంలో సాగు చేసిన ఎన్‌ఆర్‌ఐ సీడ్ కంపెనీకి చెందిన విత్తనాల కారణంగా కేళీలు ఏర్పడిన మాట వాస్తవమేనని ఆ కంపెనీ ప్రతినిధుల బృందం రైతుల వద్ద అంగీకరించింది. రైతుల డిమాండ్‌తో అనంతవరంలో బెరుకు వరి కంకులు పరిశీలించిన ఆ కంపెనీ ప్రతినిధులు అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశమై కేళీల వల్ల రైతులు నష్టపోతున్న మాట వాస్తవమేనన్నారు. కంపెనీ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 15లోపు మరోమారు పొలాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
న్యూస్‌రీల్
కౌలుదారులను మింగిన కేళీలు
కేళీలు ఉన్నమాట వాస్తవం
పులిచింతల సమాచారం
మర్యాదపూర్వక కలయిక
బాపట్ల
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రైతులు నమ్మి సాగు చేసిన విత్తనాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత సీడ్ కంపెనీనే భరించాలి. నా సోదరుల పొలంతో కలుపుకొని 40 ఎకరాలలో ఎన్‌ఆర్‌ఐ విత్తన కంపెనీకి చెందిన బీపీటీ 5204 రకపు విత్తనాలు సాగు చేశాం. ఇతర విత్తనాలు సాగు చేసిన పంట సాధారణ స్థితిలో ఉండగానే బీపీటీ 5204 రకం సాగు చేసిన మా పంటలో కేళీ కంకులు ఏర్పడ్డాయి. కేళీ కంకుల వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని విత్తన కంపెనీ ప్రతినిధులు రైతులకు చెల్లించాలి.
ధూళిపాళ్ల రవికుమార్, రైతు, అనంతవరం.
7
టీడీపీ నేత వద్ద విత్తనాలు కొనుగోలు
కాలపరిమితికి ముందే కంకుల రాక
పంటను పరిశీలించిన కంపెనీ
ప్రతినిధులు
కేళీలు ఉన్నట్లు నిర్ధారణ
రైతులను ఆదుకుంటామని హామీ
వరిలో కేళీల వల్ల కౌలుదారులకు తీవ్ర నష్టం ఏర్పడనుంది. 16 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. ఎన్‌ఆర్‌ఐకు చెందిన బీపీటీ 5204 రకం విత్తనాల కారణంగా తీవ్రమైన పంట నష్టం ఏర్పడనుంది. కేళీల కారణంగా ధాన్యం దిగుబడులు సగానికి సగం తగ్గిపోతే కౌలుకు తీసుకున్న పొలాలకు కౌలు చెల్లించే వెసులుబాటు ఉండకపోగా, అప్పుల పాలవ్వాల్చి వస్తుంది.
–అలనేని శివప్రసాద్,
కౌలు రైతు, అనంతవరం.
అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు.
నరసరావుపేటటౌన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కళ్యాణ్ చక్రవర్తిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు.
1/7
రైతులకు కేళీ కష్టాలు
2/7
రైతులకు కేళీ కష్టాలు
3/7
రైతులకు కేళీ కష్టాలు
4/7
రైతులకు కేళీ కష్టాలు
5/7
రైతులకు కేళీ కష్టాలు
6/7
రైతులకు కేళీ కష్టాలు
7/7
రైతులకు కేళీ కష్టాలు