మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల పతులకాలనీకి చెందిన మైనర్ బాలిక (2) పై అదే ప్రాంతానికి చెందిన గురజాల మహేష్ అనే వ్యక్తి 2021 జనవరి నెలలో లైంగికదాడికి పాల్పడినట్టు మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం మహేష్‌కు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.12వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పును వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు నగదు పరిహారాన్ని చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు పీజీ సోషల్ వర్క్ ఫలితాలు విడుదల విద్యుత్ సబ్ స్టేషన్‌ను సందర్శించిన జేసీ రంగా వర్సిటీలో వాల్మీకి జయంతి
నరసింహస్వామి హుండీ లెక్కింపు
మంగళగిరి టౌన్ : మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్‌నాథ్ పర్యవేక్షించారు.
సెమిస్టర్ ఫలితాలు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.
బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు..
వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.