
నగరం: మండలంలోని చినమట్లపూడి శివారు దళితవాడలో అరవై సంవత్సరాల వృద్ధురాలిపై అత్యాచారం చేసి మరణానికి కారణమైన నిందితుడు వసుమతి విజయ్‌కుమార్ అలియాస్ విజయ్‌ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్‌బాబు సమాచారం మేరకు.. చినమట్లపూడి శివారు దళితవాడలో సుశీలమ్మపై ఈనెల 2వ తేదీ తెల్లవారుజాము సమయంలో అదే గ్రామానికి చెందిన విజయ్ అత్యాచారం చేయడంతో మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు.విచారణలో విజయ్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయని చెప్పాడు. నిందితుడిని శిరిపూడి నాగమ్మ కొట్టు సెంటర్ వద్ద సోమవారం అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ఐ బండ్ల భార్గవ్ పాల్గొన్నారు.