
బళ్లారి రాఘవ జీవితం స్ఫూర్తిదాయకం
ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్
బాపట్ల: ప్రముఖ0 రంగస్థల నటుడు, సామాజిక సంస్కర్త బళ్లారి రాఘవ జయంతిని పురస్కరించుకొని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, , ఆర్డీవో గ్లోరియా, డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, తహసీల్దార్ షేక్ షాలీమా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాఘవ చిత్రపటానికి పూలమాల వేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బళ్లారి రాఘవ కేవలం నటుడేగాక సామాజిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన కళాకారుడని పేర్కొన్నారు. భావోద్వేగాలకు, వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన ఆయన నాటకాలు సమాజాన్ని చైతన్యపరిచేలా ఉన్నాయని కొనియాడారు. కళను వినోదంగా కాకుండా సామాజిక మార్పు కోసం వేదికగా వాడిన ఘనత రాఘవదేనన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.