ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి!

Aug 4 2025 3:33 AM | Updated on Aug 4 2025 3:57 AM

మనిషి ఏ పని చేయాలన్నా శరీరంలోని ఎముకలు పటిష్టంగా ఉండాలి. ఆధునిక జీవన శైలి వల్ల ఆర్థోపెడిక్‌ సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్‌ ఆర్థోపెడిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2012 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 4న దేశంలో ‘బోన్‌ అండ్‌ జాయింట్‌ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం.

గుంటూరు మెడికల్‌ : గుంటూరుకు చెందిన రోహిత్‌ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ఆటలాడుతూ కింద పడటంతో చెయ్యి విరిగింది. తల్లిదండ్రులు ఆర్థోపెడిక్‌ వైద్యుల వద్దకు రోహిత్‌ను తీసుకెళ్లారు. ఏసీ తరగది గదుల్లో ఉండటం, చదువుల ఒత్తిడిలో సమతుల ఆహారం కూడా తీసుకోకపోవడం, ముఖ్యంగా క్యాల్షియం సరిపడా ఉంటే ఫుడ్‌ తీసుకోకపోవడం వల్లే కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోతున్నాయని వెల్లడించారు.

సమస్యలకు కారణాలివీ....

ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది ఏసీలకే పరిమితమై కొంతసేపు కూడా సూర్యరశ్మి సోకకుండా గదుల్లోనే ఉండిపోతున్నారు. దీంతో విటమిన్‌ ‘డి’ లోపంతో ఎముకల పటుత్వం తగ్గిపోతోంది. ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఊబకాయం పెరిగిపోయి ఆర్థోపెడిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. వయస్సు పైబడిన వారు సహజసిద్ధంగా తమ శరీరంలో తగ్గిపోయే కాల్షియాన్ని తిరిగి భర్తీ చేసుకోవడం లేదు. ఇదీ ఆర్థోపెడిక్‌ సమస్యలకు కారణం అవుతోంది. స్మోకింగ్‌ వల్ల కూడా కాల్షియం స్థాయి పెరగకుండా ఎముకల అరుగుదల జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్థోపెడిక్‌ సర్జన్లు 350 మంది ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు 50 మంది పలు సమస్యలతో చికిత్స పొందుతున్నారు.

ఏటికేడు పెరుగుతున్న ఆర్థోపెడిక్‌ సమస్యలు సమతుల ఆహారం, వ్యాయామంతో మేలు మారిన జీవనశైలితో యువతలోనూ కీళ్ల సమస్యలు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు నేడు ‘బోన్‌ అండ్‌ జాయింట్‌ డే’

గుంటూరు జీజీహెచ్‌

ఆర్థోపెడిక్‌ ఓపీ కేసుల వివరాలు

ఏడాది ఓపీ రోగుల సంఖ్య

2020 24,569

2021 33,567

2022 47,814

2023 49,678

2024 51,096

ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి!1
1/1

ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement