రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం

Aug 3 2025 3:07 AM | Updated on Aug 3 2025 3:07 AM

రైతు

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం

రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి

అనగాని సత్యప్రసాద్‌

రేపల్లె: రైతు సంక్షేమంతోనే దేశ సంక్షేమమన్న దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. పట్టణంలోని మార్కెట్‌ యార్డు కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ నగదును రైతులకు పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. పథకం కింద ఎవరికై నా సందేహం ఉంటే 155251 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి చేతుల మీదగా అన్నదాత సుఖీభవ నగదును విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నేలపు రామలక్ష్మి, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, ఏడీఏ అద్దేపల్లి లక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కట్టా మంగ, టీడీపీ నాయకులు పంతాని మురళీధరరావు, అనగాని శివప్రసాద్‌, గూడపాటి శ్రీనివాసరావు, జీవీ నాగేశ్వరరావు, మేకా వెంకట శివరామకృష్ణ, జీపీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శనివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కు 316, బ్యాంక్‌ కెనాల్‌కు 1,807, తూర్పు కాలువకు 749, పశ్చివ కాలువకు 283, నిజాంపట్నం కాలువకు 488, కొమ్మూరు కాలువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక బ్యారేజీ నుంచి 1,89,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.

వైభవంగా శ్రీనివాస కల్యాణం

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): స్థానిక ఆర్‌.అగ్రహారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి భక్త బృందం, వామనాశ్రమ స్వామిజీ వారి ఆధ్వర్యంలో చేపట్టారు. వామనాశ్రమ స్వామీజీ మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణం వల్ల వివాహా పవిత్రత, కుటుంబ విలువలు తెలుస్తాయని చెప్పారు. వేద పండితులు (తిరుపతి) శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త అనంతలక్ష్మి (హైదరాబాద్‌) శ్రీనివాస వైభవాన్ని భక్తులకు తెలిపారు. అనంతరం స్వామిజీ భక్తులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్‌ఎస్‌ఆర్‌.ఆంజనేయులు, మహంకాళి శ్రీనివాసరావు, బాపారావు, రఘు, జుజ్జూరు శ్రీనివాసరావు. త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు.

దర్గాలో నిర్మాణాలు కూల్చివేత

పెదకాకాని: బాజీబాబా దర్గాలో శిథిలావస్థకు చేరిన గదుల నిర్మాణాలను వక్ఫ్‌బోర్డు అధికారులు పొక్లయిన్‌తో కూల్చివేయించారు. గత నెల 28న గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించిన వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ అజీజ్‌ శిథిలావస్థకు చేరిన గదులు కూలితే భక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు దర్గా ఈఓ శనివారం షెడ్డును కూల్చివేయించారు. త్వరలో మాస్టర్‌ ఫ్లాన్‌ రూపొందించి నూతనంగా గదులను నిర్మించడం జరుగుతుందని ఈఓ తెలిపారు.

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం 1
1/3

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం 2
2/3

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం 3
3/3

రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement