
వరికూటి ఉద్యమానికి బాసటగా రైతులు
బాపట్ల జిల్లావ్యాప్తంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపి ఇప్పటికే కాలువలకు నీరు విడుదల అయినందున తక్షణం అన్ని ప్రాంతాల్లోనూ పూడికతీత పనులు చేపట్టాలని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో పది రోజుల కిందట నేరుగా కాలువలోకి దిగి పరిస్థితిని అధికారుల కళ్లకు కట్టారు. ఆ తర్వాత కాలువలు శుభ్రం చేయకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. అంతటితో వదలక సమస్య పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. శుక్రవారం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. పనులు చేసి లేదా చేస్తామని హామీ ఇచ్చి, తక్షణం పనులు మొదలుపెట్టి వరికూటితో దీక్ష విరమింప చేయాలే తప్ప అవేమీ చేయకుండా పోలీసులు వచ్చి అశోక్‌బాబును చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లి పిడిగుద్దులతో కుళ్లపొడిచి సృహతప్పి పడిపోయేలా దాడి చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయమని అడిగితే పోలీసులను పెట్టి కొట్టించడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీలకతీతంగా అన్నదాతలు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా వరికూటికి మద్దతుగా నిలుస్తున్నారు.