
అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి
రేపల్లె: సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసు అధికారులు కృషి చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్యసాయి తెలిపారు. పట్టణంలోని సబ్‌కోర్టు హాలులో శనివారం కోర్టు పరిధిలోని పోలీసుస్టేషన్‌ల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యసాయి మాట్లాడుతూ పరిష్కరించదగిన కేసులను, రాజీ మార్గాన్ని ఎంచుకున్న కక్షిదారుల కేసులను, క్రిమినల్, సివిల్ ప్రీలిటిగేషన్ వంటి కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా పనిచేయాలని తెలిపారు. లోక్ అదాలత్‌లతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కక్షిదారులు తమ సమస్యలను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.గీతాభార్గవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ.వెంకటగిరిధర్, సెక్రటరీ యు.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్యసాయి