అమరావతి: మండల పరిధిలోని ఓ గ్రామంలో నాలుగేళ్లబాలికతో వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన అదివారం చోటు చేసుకుంది. సీఐ ఎ.వి బ్రహ్మం అందించిన సమాచారం మేరకు సుమారు అరవై ఏళ్ల వృద్ధుడు కె.బుల్లయ్య ఆదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించటంపై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పీఆర్‌టీయూ గౌరవాధ్యక్షుడిగా వెంకటరెడ్డి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) గౌరవాధ్యక్షుడిగా కె.వెంకటరెడ్డి (పమిడిమర్రు), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్.అబ్దుల్‌సత్తార్ (సంతగుడిపాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన యూనియన్ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ఎన్నుకున్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కె.శ్యామ్ మోజెస్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, అక్రమ సస్పెన్షన్‌లు రద్దు చేయాలని సమావేశంలో తీర్మానించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, రవీంద్రబాబు పాల్గొన్నారు.