Weekly Horoscope Telugu: ఈ రాశుల వారు వారం మధ్యలో శుభవార్త వింటారు, ఆస్తిలాభం

Weekly Horoscope Telugu 15-01-2023 To 21-01-2023 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని వివాదాలు, కేసులు సైతం పరిష్కారమ వుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. విద్యార్థుల్లోని  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. సోదరుల నుండి సమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నైపుణ్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో అయోమయం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. వాహనయోగం. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన. లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత పటిష్ఠమవుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో గందరగోళం. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో కుటుంబంలో చిక్కులు. అనారోగ్యం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలం. కళాకారుల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో మానసిక అశాంతి. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. శ్రమాధిక్యం. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు :

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top