ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 12-04-26 To 18-04-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Apr 12 2026 3:50 AM | Updated on Apr 12 2026 5:04 AM

Weekly Horoscope Telugu 12-04-26 To 18-04-2026

మేషం...
మరింత ఉత్సాహంగా కొన్ని∙కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.∙ఆప్తులు మరింత దగ్గరకు చేరతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు,  దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం....
రాబడితో సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. కొందరుæ మిత్రులను కలుసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమసమస్యలు, నీలం, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.

మిథునం...
మిత్రుల సలహాలు అవసరం కావచ్చు. పనులను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలోలాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్న గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో విందువినోదాలు. వస్తులాభాలు. నీలం, ఆకుపచ్చ రంగులు,  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం...
ఎటువంటి వివాదమైనా సర్దుబాటు కాగలదు.. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నేరేడు, నీలం రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.

సింహం....
కొన్ని క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటాబయటా అనుకూలత ఉంటుంది.  మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో మరిన్ని ఖర్చులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య....
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.. ముఖ్య వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టర్లకు  లాభదాయకంగా ఉంటుంది.  విద్యార్థులకు  ఉత్తమ ఫలితాలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, గణేశాష్టకం పఠించండి.

తుల.....
ఉన్నతస్థాయి వారితో పరిచయాలు. రాబడి అవసరాలకు తగినంతగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు, వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
అనుకున్న  వ్యవహారాలను నేర్పుగా చక్కబెడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు,  పారిశ్రామికవర్గాలకు  ఒత్తిడులు తగ్గుతాయి. వారం మధ్యలో వివాదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు...
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరోవైపు ఖర్చులను తట్టుకునేందుకు యత్నిస్తారు.. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ధైర్యంగా ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలు, కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం....
మీ అభిప్రాయాలను బంధువులు గౌరవిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధులు మరింత తేలికపడతాయి. క్రీడాకారులు,  కళాకారులకు ఊహించని అవకాశఆలు రావచ్చు. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. బంధువులతో వివాదాలు. నీలం, తెలుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం...
వ్యవహారాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగుల చిరకాల ఆశ ఫలించే సమయం. కళాకారులు, రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

మీనం....
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల ఆదరణ  లభిస్తుంది.. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల  నుండి ఆమోదం లభిస్తుంది. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కీలక పోస్టులు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు,  శివాష్టకం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement