ఈ వారంలో ఈ రాశివారి ఆశలు ఫలిస్తాయి..

Weekly Horoscope In Telugu 11th July To 17th July 2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. రావలసిన  బాకీలు అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు.  ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ప్రశంసలు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఋణవిమోచనాంగారక స్తోత్రం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబసమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో కొంత అనుకూలత. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో వ్యతిరేకత పెరుగుతుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మరింత పనిభారం. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో  శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థుల్లో  పట్టుదల పెరుగుతుంది. ప్రత్యర్థులను కూడా ఆకర్షిస్తారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రావలసిన సొమ్ము అంది ఎటువంటి ఖర్చులైనా అధిగమిస్తారు.  కుటుంబంలో విభేదాలు  తొలగి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు ఆటంకాలు అధిగమించి సమయానికి పూర్తి చేస్తారు.  మీ ప్రతిపాదనలకు కుటుంబసభ్యుల ఆమోదం లభిస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు  మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావన ఉంటుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు. పారిశ్రామికవర్గాలకు వివాదాలు సర్దుమణుగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆలోచనలు కార్యరూపం అమలు చేస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువులు, మిత్రులతో నెలకొన్న విభేదాలు పరిష్కారం. రావలసిన బాకీలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో  ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన  పనులు పూర్తి చేసేవరకూ విశ్రమించరు.   కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం అందుతుంది.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో లేనిపోని ఖర్చులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్నరీతిలో సాగుతాయి.. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.మీ నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబసభ్యులు అన్నింటా చేయూతనందిస్తారు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. తెలుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీ సూర్యప్రార్థన  మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహవేడుకలపై చర్చలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆప్తుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త ఉద్యోగాలు లభించే సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు సమయానుసారం పూర్తి కాగలవు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూవివాదాలు సర్దుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరణ కార్యక్రమాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో అనుకూలత. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ  ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ యత్నాలలో పురోగతి. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త భాగస్వాముల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంతమేర తగ్గుతాయి. రాజకీయవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. నిరుద్యోగులకు నిరాశ. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని ఖర్చులు తగ్గుతాయి. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తాయి. అనుకోని విధంగా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. ఎటువంటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సహచరులతో సఖ్యత నెలకొంటుంది. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి మంచిది. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top