ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభ సూచనలు | Rasi Phalalu: Daily Horoscope On 21-08-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. ధనలాభ సూచనలు

Aug 21 2026 3:03 AM | Updated on Aug 21 2026 5:10 AM

Rasi Phalalu: Daily Horoscope On 21-08-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.నవమి రా.11.37 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: అనూరాధ ప.1.18 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.7.29 నుండి 9.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: లేవు, వరలక్ష్మీ వ్రతం.

సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం... వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

మిథునం.... స్థిరాస్తి వృద్ధి. పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు ఆశాజనకం.

కర్కాటకం.... శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు ఎదురుకావచ్చు.

సింహం... సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కన్య.... బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృశ్చికం... ఆసక్తికర సమాచారం. శుభకార్యాల ప్రస్తావన. ధనలబ్ధి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

ధనుస్సు... వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కుంభం..... పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.

మీనం... కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement