గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: పౌర్ణమి ప.12.53 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: అనూరాధ ప.3.21 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.9.32 నుండి 11.20 వరకు, దుర్ముహూర్తం: సా.4.43 నుండి 5.35 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.
వృషభం.. శ్రమానంతరం పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారస్తులకు నిరాశ. ఉద్యోగులు మరింత శ్రమపడాలి.
మిథునం..... నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
కర్కాటకం....సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలత.
సింహం... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.
కన్య... వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
తుల..... కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
వృశ్చికం.... రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. బంధువుల కలయిక. ఆరోగ్యసమస్యలు. బాద్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
ధనుస్సు... గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. కార్యజయం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
మకరం....... రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
కుంభం.... ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం.... కుటుంబంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.


