ఈ రాశివారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి

Horoscope Today 13 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.అష్టమి తె.4.06 వరకు (తెల్లవారితే మంగళ వారం), తదుపరి నవమి, నక్షత్రం: విశాఖ రా.10.20 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.2.14 నుండి 3.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.23 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.40 వరకు, అమృతఘడియలు: ప.1.35 నుండి 3.11 వరకు.

సూర్యోదయం :    6.33
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: కష్టాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. వ్యవహారాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలతో నడుస్తాయి.

సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత ఇబ్బంది. దూరప్రయాణాలు. ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

ధనుస్సు: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదనపు ఆదాయం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని సంఘటనలు. వ్యాపార , ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. రుణయత్నాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top