కూలీలను పెడితే చేతికి ఏమీ రాదు | - | Sakshi
Sakshi News home page

కూలీలను పెడితే చేతికి ఏమీ రాదు

Aug 3 2026 3:39 AM | Updated on Aug 3 2026 3:39 AM

ఆకుకూరల కోతకు బయటి కూలీలను పెడితే.. ఆకుకూరలు అమ్మగా వచ్చిన కాస్త డబ్బులను వారికే కూలి కింద ఇచ్చేయాలి. అప్పుడు మా చేతికి ఏమీ మిగలదు. అందుకే తెల్లవారుజాము నుంచే మా కుటుంబమే పొలానికి వచ్చి మధ్యాహ్నం వరకు ఆకుకూరలు కోసి, కట్టలు కట్టి సొంతంగా అమ్ముతాము. అంత కష్టపడ్డా అక్కడ దక్కేది తక్కువే.

– మేకల లక్ష్మిదేవి, కుమ్మరపల్లె

ఆటోలకే సగం పోతోంది

రైతుల దగ్గర నుంచి ఆకుకూరలు సేకరించుకుని, వాటిని సంతలకు తీసుకెళితే అక్కడ ‘గేట్‌ ఫీజు’ పేరు చెప్పి రూ.300 వసూలు చేస్తున్నా రు. ఆటో ఛార్జీలు మరో రూ.300 ఖర్చు అవుతోంది. ఒక ఆకుకూర కట్ట అమ్మితే మాకు వచ్చేది కేవలం రూ.3 నుంచి రూ.5 మాత్రమే. రోజువారీ కూలి రూ.300 నుండి రూ.500 కూడా చేతికి రావడం లేదు. – లక్ష్మిదేవి, చిరువ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement