గుక్కెడు నీళ్లివ్వలేరా! | - | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీళ్లివ్వలేరా!

May 26 2026 2:56 AM | Updated on May 26 2026 2:56 AM

ఎండలు మండుతున్నా ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి అధికారులకు మనసు రావడం లేదు. ఈ చిత్రమే దీనికి సాక్ష్యం. ఓ కుర్చీ.. అందులో రెండు నీళ్ల బాటిళ్లు.. చిన్న అట్టపెట్టెలో ఓఆర్‌ఎస్‌ప్యాకెట్లు.. దీనికి కాపలాగా ఓ సెక్యూరిటీ గార్డు.. అర్జీ చేతబట్టుకుని దూరాన్ని..భారాన్ని లెక్కచేయకుండా కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారుల దాహం తీర్చడానికి అధికారుల ‘ప్రత్యేక’ ఏర్పాట్లట ఇవి. ఈ రెండు నీళ్లబాటిళ్లతోనే వందలాది మంది దప్పిక తీర్చుకోవాలట మరి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు అద్దంపట్టే దృశ్యమిది. అసలే విపరీతమైన వేడి, ఆపై ఉక్కపోత ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమగోడు చెప్పుకొని పరిష్కరించుకోవాలని కలెక్టరేట్‌కు వచ్చారు. తా గడానికి గుక్కెడు నీళ్లు దొరక్క దాహానికి అల్లాడిపోయారు. కలెక్టరేట్‌లో నీటి సౌకర్యం కల్పించకపోవడంపై జనం మండిపడ్డారు. – సాక్షి, మదనపల్లె

Advertisement
 
Advertisement
Advertisement