నిషేధిత గడ్డి మందు ఆమ్మకాల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

నిషేధిత గడ్డి మందు ఆమ్మకాల నిలిపివేత

May 24 2026 1:09 AM | Updated on May 24 2026 1:09 AM

గుర్రంకొండ : మండలకేంద్రమైన గుర్రంకొండలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి నిషేధిత గడ్డిమందు అమ్మకాలను వ్యవసాయాధికారులు నిలిపివేశారు. శనివారం ఎవో రత్నమ్మ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా పలు దుకాణాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకొన్నారు. వాటి అమ్మకాలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని విక్రయిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కీటకనాశన చట్టం 1968 ప్రకారం ఈ మందులను 60 రోజుల పాటు నిషేధించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement