రొంపిచెర్ల : రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డు పక్కనే మూడు నెలలుగా గుర్తు తెలియని కారు ఉంది. ఈ కారును ఎవరైనా ఎర్రచందనం తరలించేందుకు తెచ్చి అక్కడ వదిలి వెళ్లారా? గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసి ఇక్కడ వదిలి వెళ్లారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు నంబరు ఏపీ02 ఎజడ్ 7181 గా ఉంది. గుర్తు తెలియని కారుపై స్థానిక పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రజలు కోరుతున్నారు.
సరస్వతీ నిలయంపై దాడి!
రాజంపేట : నియోజకవర్గంలోని నందలూరు మండలం లేబాక జిల్లా పరిషత్ హైస్కూల్(సర్వసతినిలయం)ంపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో విద్యాసంస్ధలపై కూడా రాజకీయ వర్గ వైషమ్యాలు చుట్టుముడుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. దొంగలు బీరువాలపై తమ ప్రతాపం చూపారు. బీరువాల్లో హైస్కూల్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. కొన్ని రికార్డులు కనిపించడంలేదని సమాచారం. హైస్కూల్ హెచ్‌ఎం రాజేశ్వరి నందలూరు పోలీసులకు పిర్యాదు చేశారు.
లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా..
గుర్తుతెలియని వ్యక్తులు హెచ్‌ఎం కార్యాలయంలో లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీరువాలను ఉద్దేశపూర్వకంగా పగులగొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు కారకులు ఎవరు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.
● రికార్డులు మాయం
● లేబాక హైస్కూల్లో ఘటన


