నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : దాడి చేసి, కులం పేరుతో దూషించిన ఇద్దరిపై శుక్రవారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు నిమ్మనపల్లె ఎస్సై రామకష్ణ తెలిపారు. మండలంలోని కొండయ్యగారిపల్లెకు చెందిన కత్తి శ్రావణి కూలి పనులకు వెళ్లేదన్నారు. అదే ఊరికే చెందిన రెడ్డిశివక్రిష్ణకు, శ్రావణి కి అక్రమ సంబంధం ఉందని రెడ్డిశివక్రిష్ణ భార్య శోభన అనుమానిస్తూ వుండేదన్నారు. అప్పుడప్పుడు శ్రావణిని చూసి తిట్టడమే కాకుండా శుక్రవారం ఇంటికి వెళ్లి కొట్టి కులం పేరుతో దూషించిందన్నారు. దీంతో బాదితురాలు ఫిర్యాదు పై రెడ్డిశివకష్ణ, శోభన పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇంటికి చేరిన మస్కట్ మహిళ
వాల్మీకిపురం : మస్కట్‌లో సేఠ్‌్ వేధిస్తున్నాడంటూ వీడియో ద్వారా వైరల్ అయిన వాల్మీకిపురం పట్టణం నమాజ్‌కట్టవీధికి చెందిన మహిళ షహనాజ్ శుక్రవారం ఇంటికి చేరుకుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని బాధితురాలిని మంగళగిరిలో వైద్య పరీక్షలు చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం కారులో విజయవాడ నుంచి శుక్రవారం రాత్రి వాల్మీకిపురాని చేరుకుంది. తన ముగ్గురు పిల్లలను హత్తుకొని బోరున విలపించింది.
దాడిలో గాయపడిన
మహిళ మృతి
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి కస్సా బీసీ కాలనీకి చెందిన పసుపులేటి సుబ్బమ్మ (60)కి ఎదురింటి వారితో పదిరోజుల క్రితం ఇంటి ముందుర కసువు, నీళ్లకోసం గొడవపడిన ఘర్షణలో గాయపడింది. చికిత్సపొందుతూ గురువారం అర్దరాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ గోల్గొండ శోభ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు పసుపులేటి సుబ్బమ్మ ఎదురింటి వేణు, సావిత్రిలు ఇంటిముందర కసువు, నీళ్లు కోసం ఇరువురు ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో సుబ్బమ్మ తలకు తీవ్రగాయమైంది. ఆమెను లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సుబ్బమ్మను తిరుపతి రుయాకు తరలించారు. రుయాలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి సుబ్బమ్మ మృతి చెందినట్లు ఎస్‌ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఈ మేరకు వేణు, సావిత్రిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సీఐ కృష్ణంరాజ్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చౌక దుకాణంలో తనిఖీలు
మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో ఓ చౌక దుకాణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే 34వ దుకాణంలో తనిఖీలు చేశారు. బియ్యం, జొన్నలు, అంగన్‌వాడీలకు వచ్చే సన్నబియ్యం నిల్వలు పంపిణీపై ఆరా తీశారు.


