టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

తిరుపతి తుడా : రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయచోటి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ దశరథరామిరెడ్డిని శుక్రవారం రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయచోటిలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి భూ దందాలు, రౌడీయిజం, గంజాయి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రామ్‌ప్రసాద్‌రెడ్డి రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వారికి ఇదే పరిస్థితి భవిష్యత్‌లో ఎదురవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దాడి చేయడంపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైందన్నారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement