విధులకు మంగళం.. ఆఫీసులకు తాళం | - | Sakshi
Sakshi News home page

విధులకు మంగళం.. ఆఫీసులకు తాళం

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

దనపల్లెలోని ప్రభుత్వశాఖల జిల్లా కార్యాలయాల పనితీరు ఇంకా మెరుగుపడలేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తాళం వేసిన ఈ కార్యాలయాలు. శుక్రవారం పనిదినమే అయినా కార్యాలయాలకు తాళాలు కనిపించాయి. ఇలా ఎందుకు తాళాలు పడ్డాయో ఉన్నతాధికారులే విచారించాల్సి ఉంది. మడికయ్యల శివాలయం వెళ్లేదారిలోని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా క్రీడాధికార శాఖ, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాలకు తాళాలు వేసి ఉండటం కనిపించింది. ఇదే ప్రాంగణంలోని మిగతాశాఖల కార్యాలయాల్లో ఆశాఖల అధికారులు విధుల్లో ఉండగా ఈశాఖల కార్యాలయాలు మాత్రం తెరచుకోలేదు. విధుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి ఈ చిత్రాలే సాక్ష్యాలు. –సాక్షి, మదనపల్లె

తాళాలువేసిన క్రీడా, మైనార్టీ సంక్షేమ జిల్లా కార్యాలయాలు, తెరుచుకోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయం

Advertisement
 
Advertisement
Advertisement