సాక్షి, మదనపల్లె: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, పోరాట స్ఫూర్తి, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. గురువారం కలెక్టరేట్ హాల్‌లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన విప్లవ యోధుడని అన్నారు. అల్లూరి పోరాట ఫలితంగానే గిరిజన సంక్షేమం, అటవీ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. డీఆర్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి, డ్వామా పీడీ వెంకటరత్నం, స్టెప్ అధికారి నారాయణ, శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జేసీ శివ్ నారాయణ శర్మ


