‘మిషన్‌ ఎయిడ్స్‌’ను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘మిషన్‌ ఎయిడ్స్‌’ను విజయవంతం చేయండి

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

‘మిషన్‌ ఎయిడ్స్‌’ను విజయవంతం చేయండి రక్త కొరత లేకుండా చూడాలి దరఖాస్తుల ఆహ్వానం

మదనపల్లె టౌన్‌: మిషన్‌ ఎయిడ్స్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎయిడ్స్‌ నియంత్రణ మండలి (దిశా) జిల్లా క్లస్టర్‌ మేనేజర్‌ భాస్కర్‌ కోరారు. గురువారం మదనపల్లె ఏఆర్‌టీ సెంటర్లో వైద్య సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైరిస్క్‌ గ్రూపులతో పాటు, అనుమానం ఉన్నవారికి సైతం హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధిగ్రస్తులకు ఈ ఆర్టీవో మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

మదనపల్లె టౌన్‌: మదనపల్లె జిల్లా ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తం కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండలి అధికారి డాక్టర్‌ రాధిక సూచించారు. గురువారం ఆమె మదనపల్లి బ్లడ్‌ బ్యాంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్లడ్‌ బ్యాంకులోని నిల్వ లు, రికార్డులను పరిశీలించారు. రక్తదానం చేసే దాతలు ప్రాణదానంతో సమానమని తెలపాలన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. బ్లడ్‌ బ్యాంకు పరిధిలో ప్రతి నెలా క్యాంపులు నిర్వహించాలన్నారు. ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు సేకరించిన రక్తం 30శాతం ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంకులకు అందజేయాలన్నారు. ఎవరైనా రక్తం అమ్మినట్లు సమాచారం తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా క్లస్టర్‌ ప్రోగ్రాం అధికారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

మదనపల్లె సిటీ: జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సైట్‌ ఇంజనీర్లు, డ్రాప్ట్‌మెన్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ సున్నా అనూరాధ తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు సైట్‌ ఇంజనీర్లు నాలుగు, డ్రాప్ట్‌మెన్‌ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒప్పందన ప్రాతిపదికన భర్తీ చేస్తామని వివరించారు. సైట్‌ ఇంజనీర్‌ పోస్టుకు సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ లేదా డిప్లోమా అర్హత కలిగి ఉండాలని, డ్రాప్ట్‌మెన్‌ పోస్టుకు సివిల్‌ ఇంజనీరింగ్‌ బీటెక్‌తో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఈనెల 14వతేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఎంపికై న సిబ్బంది జిల్లాలోని విద్యామౌళిక సదుపాయాలు పనులు, పాఠశాలలు, కేజీబీవీ భవన నిర్మాణాలు, మండల విద్యాశాఖ కార్యాలయాల మరమ్మతులు తదితర సివిల్‌ పనులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో ఎంఈఓ–2 రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement