మన్యం వీరుడి త్యాగం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

మన్యం వీరుడి త్యాగం స్ఫూర్తిదాయకం

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

మదనపల్లె టౌన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) ఎం. వెంకటాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు గురువారం మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పోలీసులు నిర్వహించారు. ఏఎస్పీ వెంకటాద్రి అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించా రు. అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసు లోనే దేశభక్తిని పుణికిపుచ్చుకున్న అల్లూరి బ్రిటీష్‌ పాలకులకు ముచ్చెమటలు పట్టించారన్నారు. దాస్య శృంఖలాలను తెంచేందుకు ఆయన చూపిన తెగువ, పట్టుదల నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఏఓ శ్రీనివాసులు, రిజర్వ్‌ ఇన్స్పెక్టర్లు వి.జె. రామకృష్ణ, కె. సురేష్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement