మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ఐదుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం ఉదయం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నుంచి మదనపల్లెకు వస్తున్న ఓ కారు వేంపల్లి సమీపంలోని బెంగళూరు రోడ్డు, రెడీ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద మదనపల్లెకు కూలి పనులకు వెళ్తున్న మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీకిలబైలు గ్రామం జోలపేటకు చెందిన రామలక్ష్మి, చలపతి, తిప్పారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్, మరో బైక్‌పై ఉన్న కిరణ్, ఆనంద్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. రామలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. మిగిలిన నలుగురు మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్స పొందు తున్నారు. సమాచారం అందుకున్న మదనపల్లె తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన రామలక్ష్మి, చంద్రశేఖర్, చలపతి


