తిరుపతి అర్బన్: విశ్వం విద్యా సంస్థల్లో శిక్షణ పొందిన విద్యార్థులు పాలిసెట్–2026 ఉత్తమ ర్యాంకులు సాధించారని విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం విద్యా సంస్థల్లో 2026 సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌కు శిక్షణ పొందిన విద్యార్థులు 100 శాతం అర్హత సాధించారని చెప్పారు. తమ విద్యార్థి వెల్దుర్తి మోక్షిత్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు, ఎస్వీయూ రీజన్‌లోనూ, జిల్లాలో స్థాయిలోనూ మొదటి ర్యాంకు దక్కించుకున్నారని వెల్లడించారు. అలాగే 2026 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో విశ్వం టాలెంట్ స్కూల్ విద్యార్థిని కే. గీతిక 300 మార్కులకు 285 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి, కరస్పాండెంట్ తులసి విశ్వనాథ్ రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు.పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలకు 8688888802, 9399976999 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.


