సాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలో చేపడుతున్న సుందరీకరణ పనులు, మౌలిక వసతుల పనులను జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి శివ్ నారాయణ్ శర్మ మంగళవారం పరిశీలించారు. కమిషనర్ కే.ప్రమీలతో కలిసిన ఆయన ముగ్గురాళ్ల వంక, బహుదా వంతెన, బస్టాండ్ సమీప ప్రాంతం, కోమటివాని చెరువు పరిసరాల్లో చేపడుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి, పరిశుభ్రత, అందాన్ని పెంపొందించేలా పనులను గడువులో పూర్తి చేయించాలని కమీషనర్‌ను ఆదేశించారు. రైతు బజార్, వారాంతపు సంత, టమోటా మార్కెట్‌యార్డులను పరిశీలించి మౌలిక సదుపాయాలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట ఉత్పత్తులను ఇబ్బందులు లేకుండా విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్, మార్కెటింగ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ


