విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

మదనపల్లె టౌన్‌: విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మదనపల్లె జిల్లా విద్యుత్‌ శాఖ విజిలెన్స్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌ అన్నారు. మంగళవారం చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి జనార్దన్‌ నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్య రెడ్డి ఆదేశాలతో, వలసపల్లి గ్రామ సచివాలయంలో సిబ్బందితో కలసి పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ మోటర్‌ స్విచ్‌లను తడి చేతులతో ముట్టుకోకుండా చెప్పులు ధరించి ఆఫ్‌ ఆన్‌ చేయాలన్నారు. పొలాల్లో తెగి పడి న విద్యుత్‌ వైర్లను తాకరాదని, పంటకు చుట్టూ వేసే కంచెకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వరాదని హెచ్చరించారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి జంతువులను వేటాడితే భారీ జరిమానా జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రైతు లు పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులను సొంతంగా వేయరాదని సూచించారు. విద్యుత్‌ సమస్య ల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912 కు డయల్‌ చేయాలని కోరారు.

పోస్టర్ల ఆవిష్కరణలో విజిలెన్స్‌ అధికారి దిలీప్‌

Advertisement
 
Advertisement
Advertisement