వైఎస్సార్‌సీపీ నేత వెంకటరామిరెడ్డికి నివాళి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత వెంకటరామిరెడ్డికి నివాళి

May 6 2026 7:55 AM | Updated on May 6 2026 7:55 AM

లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కోనంపేటకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు చిలేకంపల్లి వెంకటరామిరెడ్డి(39) సోమవారం సాయంకాలం రాయచోటి గాలివీడు రింగ్‌ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం కోనంపేటలో నిర్వహించిన వెంకటరామిరెడ్డి అంత్యక్రియల్లో లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రెడ్డయ్య, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ సింగల్‌ విండో ప్రెసిడెంటు మెరుసుపల్లి ఎర్రంరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువ నాయకులు రామాపురం మండల నల్లగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ సూరం వెంకటసుబ్బారెడ్డికి వెంకటరామిరెడ్డి బావమరిది కావడంతో.. వెంకటరామిరెడ్డి మరణ వార్తతో రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వెంకటరామిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement