వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

May 5 2026 6:44 AM | Updated on May 5 2026 6:44 AM

మదనపల్లె సిటీ: వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ది అధికారి జి,చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం డీఎస్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్రీడా శిబిరాలను సందర్శించారు. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని హాకీ, బాస్కెట్‌బాల్‌ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారు. కోచ్‌లు అందిస్తున్న శిక్షణ విధానం, క్రీడాకారుల హాజరు,మైదాన సదుపాయాలు, క్రీడాసామాగ్రి వినియోగంపై సమీక్షించారు.కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ నాగరాజు, క్రీడాభారతి సెక్రటరీ నరేష్‌బాబు పాల్గొన్నారు.

పీలేరు గ్రామ పంచాయతీకి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

పీలేరు : పీలేరు గ్రామ పంచాయతీ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందుకుంది. సోమవారం ఐఎస్‌ఓ పరిశీలకులు కేరళకు చెందిన లీడ్‌ ఆడిటర్‌ జార్జ్‌, విజయవాడకు చెందిన సీపీఆర్‌లు కె. ఆశ, ఎం. కల్యాణి పీలేరు గ్రామ పంచాయతీకి కార్యాలయాన్ని సందర్శించారు. ఐఎస్‌వో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు, పౌరులకు అందజేస్తున్న సేవలు, నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితితో జిల్లాలో ఐఎస్‌వో సర్టిఫికెట్‌ అందుకున్న తొలి గ్రామ పంచాయతీగా పీలేరు నిలవడం అభినందనీయమన్నారు.

క్రమశిక్షణతో

ఫలితాలు సాధ్యం

సాక్షి, మదనపల్లె: కృషి, క్రమశిక్షణతో కూడిన విద్య మంచి ఫలితాలు సాధిస్తుందని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జిల్లా ప్రభుత్వ హై స్కూల్లో చదివి అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను సోమవారం ఆయన జ్ఞాపికలతో సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. ఇంటర్‌లో ఆసక్తి, లక్ష్యాలకు అనుగుణంగా సబ్జెక్టులను ఎంపిక, ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఆర్డి.వైష్ణవి (595), జి.ఆది విష్ణు(592), జి.కీర్తన( 591), డి.అఖిల( 591), ఎన్‌.సుష్మాతాజ్‌ ( 590)లతో కలెక్టర్‌ ముచ్చటించారు. డీఈఓ సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, పాల్గొన్నారు.

సత్వరమే అర్జీలకు పరిష్కారం

మదనపల్లెఅర్బన్‌: ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్నారు.

మాజీ సర్పంచ్‌

కుటుంబంపై దాడి

రామాపురం: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మరో దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామపురం మండలం కల్పనాయిని చెరువుకు చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్‌ రామకృష్ణ కుటుంబంపై టీడీపీ అనుచరులు దాడి చేశారు. బాధితుల కథనం మేరకు.. రామకృష్ణ తన స్థలంలో ఇళ్లు నిర్మించేటప్పుడు రెండు అడుగుల స్థలం వదిలివేయగా, ఆ స్థలాన్ని కలుపుకొని నరసింహులు అనే వ్యక్తి నిర్మాణం చేపట్టాడు. గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి నరసింహులను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. టీడీపీ అనుచరులు జోక్యం చేసుకుని రామకృష్ణ వైఎస్సార్‌సీపీకి చెందినవాడనే కారణంగా నరసింహులును రెచ్చగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. పెద్దలు వెళ్లిపోయిన అనంతరం కర్రలు, కొడవళ్లతో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో రామకృష్ణ (67), ఆయన భార్య లక్ష్మీదేవి (65), సోదరి లక్ష్మమ్మ (70) తీవ్రంగా గాయపడ్డారు.లక్ష్మీదేవికి తలకు బలమైన గాయం కాగా, ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రామకృష్ణకు భుజం, మణికట్టు, తలకు, లక్ష్మమ్మకు చేయి, కాలుకు గాయాలయ్యాయి. ఈ ఘటన వెనుక టీడీపీకి చెందిన రమేష్‌, దిలీప్‌ అనే వ్యక్తులు ఉన్నారని బాధితులు పేర్కొన్నారు. మూడు రోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement